calender_icon.png 22 July, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఫ్ట్ అడిగి దోచుకున్న కేసులో మరో ఇద్దరు అరెస్ట్, రిమాండ్

22-07-2025 12:00:18 AM

  1. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి 

పట్టణ సీఐని అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూలై 21 (విజయ క్రాంతి), బండి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి మహిళలపాటు మరో ఇద్దరు కలిసి లిఫ్ట్ ఇచ్చిన వాహనదారిని దోచుకున్న సంఘటన కేసులో మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సోమవారం డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలను వెల్లడించారు.

బండి లిఫ్టు ఇచ్చిన పాపానికి దోచుకున్న మహిళతోపాటు ఇద్దరు దుండగులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 14,770 ల నగదు, మోటార్ సైకిల్, మూడు మొబైల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నట్లు ఏ ఎస్ పి వెల్లడించారు. కామారెడ్డి మండలం  క్యాసం పల్లి పల్లి గ్రామానికి చెందిన గంగయ్య పని నిమిత్తం ఈనెల 19న కామారెడ్డికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో కామారెడ్డి దుబ్బ గౌడ్ కల్లు దుకాణంలో కళ్ళు సేవిస్తున్నప్పుడు ఓ మహిళ వచ్చి క్యా సం పల్లి వరకు బండిపై వస్తానని లిఫ్టు అడిగింది.

బండి పై వెళ్తుండగా నవాబు వెంచర్ దాటిన తర్వాత మార్గ మధ్యలో ఆ మహిళ బండి ఆపమని చెప్పడంతో చిన్న గంగయ్య బండిని ఆపడంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి గంగాయన బెదిరించి అతని వద్ద ఉన్న ఇరవై ఎనిమిది వేల నగదు బలవంతంగా లాక్కొని అతని వద్ద ఉన్న పర్సన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడు పట్టణ పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పట్టణ సీఐ నరహరి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఐ ఉస్మాన్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలు ఏర్పడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముగ్గురు నిరసనను పట్టుకుని విచారించారు.

వారు గతంలో ఇదే పరాలో దేవునిపల్లి మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పండుగ నమ్మించి లిఫ్ట్ అడిగి అనంతరం పురుషులు వెంబడించి బెదిరించి డబ్బులు విలువైన వస్తువులు దోచుకున్నట్లు విచారణలో తేలినట్లు చైతన్య రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిందితులు కడమంచి లక్ష్మి అలియాస్ అహ్మద్ బి, షేక్ జావిద్, షేక్ అబ్బు లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 14,770 ల నగదును స్వాధీనం చేసుకున్న ఏఎస్పీ తెలిపారు.

ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నందుకు పట్టణ సీఐ నరహరిని,ఈ కేసులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ ఎస్‌ఐ లు ఉస్మాన్, వినయ్ సాగర్, పోలీస్ సిబ్బంది రాజేందర్, గణపతి, కిషన్, శ్రీనివాస్, మైసయ్య, శ్రావణ్, కమలాకర్, నరేష్, రాజు, భాస్కర్, రమేష్, అనిల్, రవి లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  ఆభినందించారు.