calender_icon.png 22 July, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్ ఛేంజర్‌గా రింగ్ రైల్!

22-07-2025 12:37:56 AM

ట్రిపుల్ ఆర్‌కు సమాంతరంగా రింగ్ రైల్

392 కిలోమీటర్లు.. రూ.12 వేల కోట్లు

దేశంలోనే మొదటి భారీ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్

తుది అలైన్‌మెంట్‌పై కసరత్తు చేస్తున్న కేంద్రం

  1. జిల్లాల నుంచి రాజధానికి పెరగనున్న కనెక్టివిటీ
  2. ఉపందుకోనున్న రియల్ ఎస్టేట్ రంగం 

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు పక్కనే రీజనల్ రింగ్ రైల్ (ఆర్‌ఆర్‌ఆర్) కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెరుగైన రవాణా వ్యవస్థకు అవకాశం ఏర్పడనుంది. దేశంలోనే ఇది అతి పెద్ద మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం కానుంది. ప్రజా రవాణాలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎం టీఎస్, సబర్బన్ రైళ్లు, మెట్రో రైలు సదుపా యం కల్పించడంతో అత్యద్భుత ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

దీంతో నగరంలోకి రాకుండానే బయటి నుంచి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. దాం తో పాటు నగరానికి మొత్తం తెలంగాణ జి ల్లాల నుంచి రాకపోకలకు మెరుగైన కనెక్టివి టీ అందుబాటులోకి వస్తుంది. దూర ప్రాంతాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు బస్సులో, స్వంత వాహనాల్లో వచ్చినా... అక్కడి నుంచి మెట్రో, ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల ద్వారా నగరానికి త్వరగా చేరుకునేందుకు వీలవుతుంది.

అలాగే నగరానికి వివిధ ప్రాంతాల నుంచి ఉన్న మార్గాల్లో రైళ్లలో వచ్చే వారు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌కు చేరుకుని అక్కడి నుంచి తాము వెళ్లాల్సిన చోటుకు చేరుకునేందుకు అనేక అవకాశాలను తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా ప్రజా రవాణాలో హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చేందుకు ఆర్‌ఆర్‌ఆర్ వేదికగా మార్చాలని కేంద్రం, రాష్ట్రం ప్రయత్నిస్తున్నాయి.

దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో మౌలిక సదుపాయాలు భారీగా పెరిగి ఉపాధి అవకాశాలకు అవకాశం ఏర్పడనుంది. ఫలితంగా ఇదో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

 నగరానికి వచ్చే అన్ని రైలు మార్గాలను కలిపేలా..

ప్రతిపాదిత రింగ్ రైలు సికింద్రాబాద్ నుంచి కాజీపేట, వికారాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, డోన్ రైలు మార్గాలను కలుపుతూ వెళ్తుంది. ఫలితంగా ఆయా మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికులు కొత్తగా ఏర్పాటు చేసే 26 స్టేషన్లలోని పలు స్టేషన్ల ద్వారా నగరంలోని గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చు. ప్రతిపాదిత ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు బూర్గుల గుట్లగూడ మాసాయ్‌పేట- గజ్వేల్- వంగపల్లి -ఆలేరు, వలిగొండ మీదుగా వెళ్లనుంది. 

బందర్ పోర్ట్‌కు కొత్త రైల్వే లైన్ ..

రాష్ట్రానికి డెడికేటెడ్‌గా సరుకు రవాణా కోసం ప్రతిపాదించిన డ్రైపోర్ట్ నుంచి బంద ర్ పోర్ట్ వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేను కూడా మరింత ఉపయోగంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. హైదరా బాద్‌గా బందర్ గ్రీన్ ఫీల్డ్ హైవేను అమరావతి, విజయవాడ మీదుగా ఏర్పాటు చేయ నున్న క్రమంలో.. ఆ రోడ్డుకు సమాంతరంగానే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా ఏర్పా టు చేస్తే భూసేకరణకు తిప్పలు పడాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు కేం ద్రం దృష్టికి తీసుకుపోయినట్లు తెలుస్తోంది.

తెలంగాణ సీఎం సైతం ఇదే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. ఫలితంగా ఎలాంటి మలుపులు లేని రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ అందుబాటులోకి వ స్తుంది. కేవలం 2 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకునేందుకు సా ధ్యమవుతుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధికి ఈ మార్గం గేమ్ ఛేంజర్ కానుంది. 

8 జిల్లాలు.. 14 మండలాలు.. 26 స్టేషన్లు..

రైలు మార్గాల విస్తరణలో భాగంగా కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి రీజినల్ రింగు రైలు ప్రాజెక్టును మంజూరు చేసింది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహూబూబ్‌నగర్ జిల్లాల మీదుగా రింగ్ రైలు రానుంది. దాదాపు రూ.12వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 392 కి.మీ మేర నిర్మించనున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో 26 స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదించారు.

8 జిల్లాలు 14 మండలాల పరిధిలో ఈ ప్రాజెక్టు రానుంది. ప్రస్తుతం నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ రైల్వే లైను వస్తుంది. 3 రకాల సర్వేలు నిర్వహించిన అధికారులు...  ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేశారు. రీజినల్ రింగు రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేలా ఈ ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును సిద్ధం చేశారు.

ఫలితంగా రింగ్ రైలు కోసం ప్రత్యేకంగా భూసేకరణ అవసరం లేకుండా పోయింది. కొన్ని చోట్ల మాత్రమే రింగ్ రైలు కోసం ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సి రానుందని అధికారులు తెలిపారు. రెండు ప్రాజెక్టులు పక్కపక్కనే రావడంతో పనులు చేపట్టడం చాలా సులభంగా మారుతుందని భావిస్తున్నారు. 

 రింగు రైలుతో రియల్ ఎస్టేట్‌కు మహర్దశ..

రింగ్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దఎత్తున ఊపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. అక్కడి భూముల ధరలు ఆకాశానికంటాయి. నగరం విస్తరించే కొద్దీ ఔటర్ రింగ్ రోడ్డు అనేది హైదరాబాదుకు సరిహద్దుగా మారింది.

ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు సైతం అలా గే మారే అవకాశం కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. రింగ్ రైలు ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ సబర్బన్ ఏరియాలో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడానికి, పారిశ్రామికంగా మరింత వేగం గా తీసుకెళ్లడానికి తోడ్పడుతుందని అం టున్నారు.

ముఖ్యంగా ఈ రైల్వే లైన్ చుట్టూ అనేక రకాల పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు నివా స ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ రైల్వే లైను ఎంతగానో ఉప యోగపడుతుంది. దీనివల్ల హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించేలా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.