23-07-2025 12:24:36 AM
రూ. 199 కోట్ల విరాళాలకు సంబంధించిన ఆంశంలో పిటిషన్‌ను తోసిపుచ్చిన ఆదాయపుపన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్
న్యూఢిల్లీ, జూలై 22: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రూ. 199 కోట్ల విరాళాల విషయంలో పన్ను మినహాయింపును కోరుతూ ఆదాయపుపన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కాగా కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని మంగళవారం ఆదాయపుపన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ తోసి పుచ్చింది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని, చట్టప్రకారం మొత్తం ఆదాయానికి పన్ను చెల్లిం చాలని స్పష్టం చేసింది.
2017-18 సంవత్సర ఆదాయపుపన్ను రిటర్నులను నిర్ణీత గడువులో దాఖలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ సంవత్సరం రూ. 199 కో ట్లు విరాళాల రూపంలో వచ్చాయని మినహాయింపు కోరింది. కాంగ్రెస్ మినహా యింపు ఆంశాన్ని 2019లో పరిశీలించిన ఐటీ అధికారులు..
దాతల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు స్వీకరించినట్లు ఒక్కొక్కరి నుంచి గరిష్ఠంగా రూ. 2 వేల వరకు మాత్రమే పన్నేతర విరాళాలు వసూలు చేసేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. దీంతో ఐటీ అధికారులు పన్ను మినహాయిం పు విజ్ఞప్తిని తోసిపుచ్చి విరాళాల రూపంలో వచ్చిన మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాలని నోటీసులు పంపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ట్రైబ్యునల్‌లో సవాల్ చేసినా ఊరట లభించలేదు.