calender_icon.png 23 July, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిరిండియా విమానంలో మంటలు

23-07-2025 12:27:03 AM

  1. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఏఐ 315 విమానం
  2. ల్యాండ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్‌లో మంటలు
  3. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం

న్యూఢిల్లీ, జూలై 22: ఎయిరిండియా విమానంలో మంగళవారం మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానా శ్రయానికి వచ్చిన ఏఐ 315 విమానం ల్యాండ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఘ టనపై ఎయిరిండియా స్పందించింది.

‘హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఏఐ 315 విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆగ్జలరీ పవర్ యూనిట్ (ఏపీయూ)లో మం టలు చెలరేగాయి. ప్రయాణికులు విమానం దిగడం ప్రారంభించిన వెంటనే ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో విమానం స్వల్పంగా దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కోసం విమానాన్ని నిలిపివేశాం’ అని తెలిపింది.

సోమవారం కూడా ఎయిరిండి యా విమానాలు పలు ప్రమాదాలకు గురయ్యాయి. కొచ్చిన్ నుంచి ముంబైకి వచ్చిన ఎయిరిండియా విమానం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై అదుపుతప్పింది. దీంతో ప్రధాన రన్‌వేపై కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

సో మవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది ప్రయాణికులతో కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం లో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్‌కు ముందుగానే దీన్ని గుర్తించి విమానాన్ని ర ద్దు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.