calender_icon.png 23 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై రైలు పేలుళ్లు.. 24న సుప్రీంలో వాదనలు

23-07-2025 12:21:27 AM

  1. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
  2. పిటిషన్ దాఖలు చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ 

న్యూఢిల్లీ, జూలై 22: 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. యాంటీ టెర్రరిస్టు స్కాడ్ (ఏటీసీ) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏటీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ తా దీనిపై అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

దీంతో ఈ నెల 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్, జస్టిస్ కే వినోద్ చంద్రన్, ఎన్‌వీ అంజరియాలతో కూడిన ధర్మాస నం దీనిపై విచారణ జరపనుంది. పే లుళ్ల ఘటనలో నిందితులను బా ంబే హైకోర్టు నిర్దోషులుగా తేల్చడ ంపై బాధిత కుటుంబాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. 19 ఏళ్ల ని రీక్షణకు అర్థం లేదని తీర్పు చెబుతు ందని ఘటనలో తన కుమార్తెను కో ల్పోయిన శ్రీనాయక్ వాపోయారు.