calender_icon.png 4 October, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కు భయం పట్టుకుంది

04-10-2025 06:06:56 PM

కాంగ్రెస్ పాలన అని రంగాల్లో విఫలం..

నల్గగొండ రూరల్: ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని బిఆర్ఎస్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో కనగల్ మండల జెడ్పిటిసి ఎంపిటిసి సర్పంచుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిందని ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన 5000 కోట్లు నిధులు రాలేదన్నారు. తప్పని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలతో ఎన్నికలు ప్రకటించినప్పటికీ ఎన్నికల వాయిదా పడాలని  కాంగ్రెస్ భావిస్తుందన్నారు. ఎన్నికలకు బిఆర్ఎస్ సిద్ధంగా ఉండాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది పెద్ద మార్పు కాబోతుందన్నారు. కులాల ప్రస్తావన లేకుండా, బిఆర్ఎస్ పార్టీ పోటీచేసిన అన్ని జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలను గెలుచుకొని, కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు.

గతంలో కనగల్ మండలంలో అన్ని స్థానాల్లో విజయ డంక మోగించమని  తిరిగి అదే స్ఫూర్తితో పార్టీ అభ్యర్థులును గెలిపించుకోవాలన్నారు. పార్టీ కార్యకర్తల కోసం  ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమనిగతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా, పార్టీకి నమ్మకంగా పనిచేసే వ్యక్తులను, యువకులకు అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశం లో రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, కనగల్ సింగిల్విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, సీనియర్ నాయకులు గోన రవీందర్రావు, మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్ రావు, మండల పార్టీ కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కడారి కృష్ణయ్య, హనుమంతు నాయక్, ఎర్రబెల్లి నర్సిరెడ్డి మహిళా అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.