calender_icon.png 4 October, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

04-10-2025 06:10:21 PM

ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కలెక్టర్ 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో 427 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ లో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 427 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వాటిలో 194 డిఆర్డిఎ ఐకెపి ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సింగిల్ విండోల ద్వారా 233 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వానాకాలం పంట చేతికి వచ్చినందున వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిని కవర్స్, వేయింగ్ మిషన్స్, తేమ కొలిచే మిషన్స్, గన్ని బ్యాగులు సమకూర్చామని అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని రైతులు నుండి కొనుగోలు చేసి త్వరగా  పేమెంట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, డిసిఎస్ఓ వెంకటేశ్వర్రావు, డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్, స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.