04-10-2025 05:56:56 PM
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
వలిగొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాక సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గెలిచే అభ్యర్థులను గ్రామస్థాయిలోనే గుర్తించాలని పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. పార్టీ నిలబడాలంటే కార్యకర్తలే ముఖ్యమని కార్యకర్తలు అందరికీ, ఉద్యమకారులందరికి అండగా ఉంటానని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన రోజు నుండి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు గ్రామాలలోనే ఉంటానని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గెలుపు అభ్యర్థులను గుర్తించి నిలబెట్టుకోవాలని అందుకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, పడమటి మమత, కొమురెల్లి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.