calender_icon.png 23 August, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటేనే కరెంటు

23-08-2025 01:12:10 AM

  1. జనవరిలో యాదాద్రి పవర్ ప్లాంట్ జాతికి అంకితం
  2. భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
  3. దేశంలో ఉత్తమ గ్రీన్‌పవర్ ఉత్పత్తికి కేంద్రంగా తెలంగాణ
  4. జెన్‌కోలో 159 మందికి కారుణ్య నియామకాలు
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాం తి): కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రానున్న జనవరి 15 నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాం ట్‌ను జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో యాదా ద్రి ప్లాంట్ భూ నిర్వాసితులు 500 మంది కి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ యాదా ద్రి పవర్ ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులకు క్యాలెండర్ నిర్దేశించి ఆ మేరకు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆ క్రమంలోనే ఇప్పటి కే రెండు యూనిట్లను జాతికి అంకితం చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేసేందుకు రైల్వే లైన్, కార్మికులు అధికారులు ఉండేందుకు టౌన్‌షిప్ ఏర్పాటుకు ముందుకు పోతున్నామని తెలిపా రు.

ప్లాంట్ పరిసరాల్లోని గ్రామాల్లో ప్ర పంచస్థాయి విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా సీఎస్‌ఆర్ నిధుల నుంచి అందజేస్తామని భరోసా ఇచ్చారు. పవర్ ప్లాంట్ పరిసరాలలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, ప్రత్యేకంగా సీసీ రోడ్లు, ఫ్లు ఓవర్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. రహదారుల భూ సేకరణకు అవసరమైన నిధుల ను మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి పవర్ యూనిట్ రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు.

గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్రంగా తెలంగాణ 

 దేశంలోనే అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తికి తెలంగాణను కేంద్రంగా చేస్తామని ప్రకటించారు.  యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాల కోసం మంత్రు లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్, నాయకులు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా పోరాటం చేశారని, వారి సంక ల్పం నేడు సాకారమైందన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన వారు ఉన్నారని, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న వారు కూడా భూములు కోల్పోతే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. 

జెన్‌కోలో కారుణ్య నియామకాలు

తెలంగాణ జెన్‌కో విధుల్లో ఉండి ప్రాణా లు కోల్పోయిన 159 మంది బాధిత కుటుంబాలకు రెండోసారి మానవీయకోణంలో కా రుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఒకసారి మాత్రమే కారుణ్య నియామకం చేపట్టేదన్నారు. 

ఉపాధి కల్పించాలనే నిర్వాసితులకు ఉద్యోగాలు: మంత్రి కోమటిరెడ్డి 

థర్మల్ ప్రాజెక్ట్‌లో భూమిని త్యాగం చేసిన దానికి వెలకట్టలేమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక చొరవతో శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్‌లో పొల్యూషన్‌ను ఎదుర్కొనేలా ఇన్నోవేటివ్‌గా ఆలోచించానలని, టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సు అవసరమేనని సూచించారు.