calender_icon.png 23 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25న క్యాబినెట్ భేటీ

23-08-2025 01:16:07 AM

కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించే విషయమై సమావేశం

  1. వినాయక చవితి తర్వాత ప్రవేశపెట్టాలనే యోచన
  2. స్థానిక సంస్థల ఎన్నికలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈ నెల 25న మరోసారి క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తారని తెలిసింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టే తేదీలను క్యాబినెట్ ఖరారు చేస్తుందని సమాచారం.

కాళేశ్వరం నివేదికపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఇటీవల హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో వినాయక చవితి ఉత్సవాల తర్వాత, అసెంబ్లీ సమా వేశాలు ఉంటాయనే ప్రచారం సాగుతున్నది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చ ఉం టుందని సమాచారం.