23-09-2025 07:02:13 PM
పోతారంలో పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించిన రాజకీయ సన్యాసం చేస్తామని, లేకుంటే మీరు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. మంగళవారం పోతారం గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు చెల్కల జితేందర్ యాదవ్, గ్రామ శాఖ పోతారం అధ్యక్షులు నర మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం ముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రూ.2 కోట్లతో మచ్చుపేట గ్రామ శివారులో ఉన్న బగుళ్లగుట్ట పుణ్యక్షేత్రానికి సీసీ రోడ్డు నిర్మాణం చేసింది నిజం కదా అన్నారు.
అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు రూ. 8 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను మోసం చేసి ఒక్కో క్వింటాలకు ఐదు నుంచి పది కిలోల ధాన్యాన్ని కడిగేసిన ఘనత మీ ప్రభుత్వానిదేనని, అ సొమ్ములు ఎక్కడికిపోయవని, ఎవరి జేబులు నిండాయని, మీ మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మీ నాయకుల ఇండ్లకు చేర లేదా అని విమర్శించారు. మీకు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే అర్హత లేదని, మండలంలో గత పదేండ్లు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారో, అవి ఎక్కడ కట్టారో మండల, గ్రామ ప్రజలకు వెంటనే తెలుపాలని డిమాండ్ చేశారు. మీ ఇసుక మాఫియా, మీ ధన దాహానికి చిద్రమైన గంగపురి-ఓడేడ్ రోడ్డు ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. మా నాయకుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆ రోడ్డును రూ. 60 కోట్లతో నిర్మిస్తున్నది నిజం కాదా అన్నారు.
గత వేసవి పంట కాలంలో ఎండిపోతున్న పంటలకు 42 రోజులు నిరంధించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తికాకుండానే ఆరు గ్యారంటీలలో గృహ జ్యోతి కింద 500 కు వంటగ్యాస్, ప్రతి ఇంటికి విద్యుత్ బిల్లులు 200 యూనిట్లవరకు ఉచితంగా అందించటం లేదా, ఉచిత బస్సు ఎక్కని మహిళా ఎవరైనా ఉన్నారా, రైతులకు రెండు లక్షల రుణమాఫి చేయలేదా గతంలో మా ప్రభుత్వ హయాంలో మంజూరైన ఓడేడ్ బ్రిడ్జిని రూ. 10 సం.రాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం పట్టించికున్నారా.. మరల మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని, ప్రభుత్వం ఏర్పడి 22 నెలలే అయినప్పటికీ మేము మూడు ఇండ్లైన ఇచ్చామని, ఇంకా మూడు మూడేళ్లు సమయం ఉందని, మంత్రి ఆశిస్సులతో 100కు పైగా ఇండ్లు నిర్మిస్తామని, యూరియా రాష్ట్ర ఆధీనంలో లేని విషయం మీకు తెలుసని, కావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి యూరియా ఉత్పత్తిని తగ్గించిందని మీకు తెలియదా అన్నారు. సీబీఐ ఎంట్రీతో మీ నాయకుడికి, మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అడవి శ్రీరాంపూర్ లో కూడా అర్హులకే ఇచ్చామని, అక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కింది ఎవరో మీరే తెలుపాలని, ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేస్తే పనులు అవుతాయా అన్నారు. మీ హయాంలో యూరియా కోసం లైన్ లు కట్టింది మీరు మరిచి పోయారా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసిలు బండ సమ్మయ్య, నెత్తెట్ల భారత లక్ష్మి కొమురయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.