23-09-2025 07:00:58 PM
జిల్లా వైద్యఅధికారి డాక్టర్. మధుసూదన్
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): అనుమతులు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులు నడపద్దని జిల్లా వైద్యఅధికారి మధుసూదన్ తెలిపారు. మంగళవారం ఆయన కాటారంలో ప్రైవేట్ ఆసుపత్రులు సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్, అరవింద ప్రధమ చికిత్స కేంద్రం, లలిత క్లినిక్ లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా ప్రైవేటు దవాఖానాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్ఎంపిలు వైద్యం పేరిట ఆసుపత్రులను కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్ లకు నోటీసులు జారీ చేశారు. తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎంపీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనుమతులు లేకుండా అబార్షన్లు చేసిన ఆసుపత్రిని సీజ్ చేస్తామని అన్నారు.