calender_icon.png 30 September, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు

30-09-2025 06:12:42 PM

మర్పల్లి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని, వారి పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న మహిళలకు విజయదశమి సందర్భంగా వారికి చీరలు పంపిణీ చేశారు. కాస్తిపురం వినోద్ స్వామి చీరలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాచన్న, చేతులమీదుగా పంపిణీ చేశారు. పారిశుద్ధ కార్మికుల పట్ల వివక్ష చూపకూడదని సమాజంలో వారికి గౌరవం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్, సహకార సంఘం వైస్ చైర్మన్ పసియిధిన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి గారి జగదీశ్వర్, సలీం ఖాన్, శేఖర్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.