calender_icon.png 30 September, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ జడ్పీటీసీ బరిలో కుక్కడపు నాగరాజు గౌడ్

30-09-2025 08:02:08 PM

కోదాడ: కోదాడ మండలంలో జడ్పీటీసీ రేసులో కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు కుక్కడపు నాగరాజు గౌడ్ పేరు చర్చనీయాంశంగా మారింది. పార్టీ పట్ల మూడు దశాబ్దాలుగా నిబద్ధతతో కట్టుబడి ఉన్న ఆయనకు గౌడ్ కులస్థులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నట్లు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. నాగరాజు గౌడ్ కు బీసీ సంఘాల నాయకులతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే పద్మావతి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని నాగరాజు గౌడ్ తెలిపారు.

మొదటి  నుంచే పదవులపై ఆశలు లేకుండా పార్టీలో కష్టపడుతూ వస్తున్న నాగరాజు, ముఖ్య పాత్ర పోషించారు. సర్ధార్ సర్వాయి పాపన్న సేన జిల్లా నెంబర్ గా వ్యవహరించిన ఆయనకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గుడిబండ గ్రామంలో విద్యార్థుల కోసమేగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పద్మావతి అమ్మ ఆశీస్సులతో ముందుకు వెళుతున్నట్లు అని తెలిపారు సుట్టు ప్రజలకు దగ్గరైన వ్యక్తిగా పేరుపొందారు. అందువల్ల పార్టీ తరపున టికెట్ ఇస్తే  స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.