30-09-2025 06:35:21 PM
రేగొండ (విజయక్రాంతి): దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్వేత లక్ష్మీ వారాహి ఆలయంలో ఉపాసకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు మహా గౌరీ స్వరూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ, మాజీ ఎంపీటీసీ మైస సుమలత, భవాని మాల ధారణ స్వాములు పాల్గొన్నారు.