30-09-2025 07:54:23 PM
అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి..
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
పాపన్నపేట (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాతను మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోకల్ షెడ్డులో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వనదుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరి వెంట ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ లు బాలాగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సంజీవ రెడ్డి, మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.