calender_icon.png 30 September, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో భార్యపై రోకలిబండతో దాడి.. అక్కడికక్కడే మృతి

30-09-2025 07:49:54 PM

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రావణ్ కుమార్..

పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ తరలింపు..

చిట్యాల (విజయక్రాంతి): మద్యం మత్తులో భార్యపై రోకలి బండతో కొట్టి చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనుకుంట్ల లింగయ్య, ప్రమీల(52) కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గత కొంతకాలంగా లింగయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్యాభర్తల ఇద్దరికీ వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో భార్యపై రోకలి బండతో లింగయ్య దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే తనువు చాలించింది. విషయం తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను తెలుసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్టు ఎస్సై తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ప్రమీల మృతి చెందడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.