calender_icon.png 24 May, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కాంగ్రెస్ నాయకుల సహపంక్తి భోజనం

18-04-2025 01:43:26 AM

మఠంపల్లి, ఏప్రిల్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుడు మఠంపల్లి హెడ్ క్వార్టర్ లో కొమ్ము బక్కయ్య కుటుంబ సభ్యులతో కలిసి  సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలోని ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించార న్నారు. పేద, ధనిక అనే బేధాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.   

మండల పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చలకూరి బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్, గురవయ్య, సైదులు, గ్రామ శాఖ అధ్యక్షుడు శౌరి, రాయలు, మాజీ సర్పంచ్ కృపానందం, మాజీ ఎంపిటిసి నర్సయ్య, బుచ్చయ్య, రాములు, ఎల్లారెడ్డి, ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.