19-10-2025 12:31:14 AM
మీనాక్షి నేతృత్వంలో ఉప ఎన్నికలో ప్రచారం
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ కాంపెయినర్లుగా మొత్తం 40మంది పేర్లతో జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం విడుదల చేశారు. ఇందులో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలోనే ఈ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా మంత్రులు, మాజీ ఎంపీ రేణుకాచౌదరి, విజయశాంతి, వీహెచ్, షబ్బీ ర్ అలీ, అజారుద్దీన్‌తోపాటు ఎంపీలు, ఇతర నేతలు ఉన్నారు.