25 March, 2026 | 2:53 AM

చివరి మడి వరకు సాగునీరు అందిస్తాం..

25-03-2026 01:16 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

చొప్పదండి, మార్చి 24 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని రై తులెవ్వరు ఆందోళన చెందవద్దని, చివరి మ డి వరకు సాగునీరు అందించి పంటలు ఎం డిపోకుండా కాపాడుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మం త్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఈఎన్సి రమేష్ బా బును హైదరాబాదులోని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మర్యాద పూర్వకంగా కలిశారు.

గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీటిని విడుదల చే యాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వర ద కాలువకు నీటిని విడుదల చేయాలని ఈ ఎన్సి ఆదేశించారు. గాయత్రి పంప్ హౌస్ నుండి వరద కాలువకు నీటిని విడుదల చే స్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని వరద కాలువకు నీటిని విడుదల చేయడానికి ఆదేశాలు జారీచేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం కృతజ్ఞతలు తెలిపారు.