20 April, 2026 | 6:28 PM

నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించిన కాంగ్రెస్ పార్టీ

20-04-2026 05:08 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని  మండల, పట్టణ, గ్రామ, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం కోసం అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించినట్లు  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియోజక వర్గాల వారీగా కో ఆర్డినేటర్ లగా నియమించినట్లు తెలిపారు. 

ఖమ్మం నియోజకవర్గానికి చక్కిలం రాజేశ్వరరావు, పాలేరు నియోజకవర్గానికి బి యం వినోద్ కుమార్, మదిర నియోజకవర్గానికి నాగసేతారాములు, వైరా నియోజకవర్గానికి కోటూరి మానవతారాయ్, సత్తుపల్లి నియోజకవర్గానికి దైదా రవీందర్ లను నియమించారు. టి పి సి సి ఆదేశానుసారం మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నియోజకవర్గ కో ఆర్డినేటర్ లకు సహకరించి కమిటీ నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు.