15-09-2025 12:38:26 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రె స్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పేర్కొన్నారు.. వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పలువురు మహిళలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలసి శా లువతో సన్మానించారు..ప్రభుత్వ విప్ మా ట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పం తో ముందుకు పోతున్నారని తెలిపారు.. అం దులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మం జూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు.అనాడు ఇందిరమ్మ రాజ్యంలో మ హిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్ర జా ప్రభుత్వంలో మహిళా తల్లిలకు పేద్ధపీఠ వేయడం జరుగుతుందని తెలిపారు..
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు 20వేల పైచిలుక కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపా రు.మహిళా సంఘాల ద్వారా సోలార్ వి ద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మి ల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చే స్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇం డ్లను కూడా మహిళల పేరు మీద మంజూ రు చేస్తుందని తెలిపారు.
ఇందిరా మహిళా శ క్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు వా రు ఆర్థికంగా ఎదగాలని మైక్రో ఎంట్ర్పజేష న్, మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లో, సోలార్ పవర్ ప్లాం ట్, డైరీ యూనిట్స్ వంటి వాటిని ఎర్పాటు చేయడం కోసం బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.2024 25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ ద్వారా 20084 కోట్లు, 2025------,26 సంవత్సరానికి 58 కోట్లు బ్యాంకు లింకేజీ అందజేయడం జరిగిందని తెలిపా రు...
4350 సంఘాలకు 5 కోట్ల 72 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.మహిళా సంఘాల సభ్యురాళ్లకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లోన్ బీమా, ప్రమాద బీమా స్కీం వలన ఎంతో మందికి ప్రయోజనం చే కూరుతుందని తెలిపారు..
ప్రమాదవశాత్తు ఎవరైనా సంఘ సభ్యులు చనిపోతే వర్ తీ సుకున్న రుణం మాఫీ తో పాటు పదిలక్షల వరకు ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుంద ని తెలిపారు.వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు.. రానున్న రోజుల్లో కాంగ్రె స్ పార్టీ ప్రభుత్వానికీ ఆశీర్వాదాలు అందజేయాలని పిలుపునిచ్చారు..