calender_icon.png 15 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

200 రోజులైనా పట్టదా!

15-09-2025 01:23:41 AM

  1. మిగతా ఆరుగురి మృతదేహాలు ఏవి?
  2. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై పాలకులు ఎందుకు స్పందించడం లేదు
  3. బాధిత కుటుంబాలకు నష్టపరిహారమూ ఇవ్వలేదు
  4. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వారిని ఆదుకుంటాం
  5. ‘ఎక్స్’వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) కూలిపోయి ఎనిమిది మంది అభాగ్యులు మరణించి 200 రోజులైనా ఇప్పటి వరకూ పాలక ప్రభుత్వాలకు పట్టడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం కారణంగా.. ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురి మృతదేహాలను కూడా వెలికి తీయలేకపోయిందని దుయ్యబట్టారు.

పైగా బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై కేంద్రాన్ని కూడా కేటీఆర్ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన చిన్న సమస్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్‌ను రాష్ట్రానికి పంపి హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీలోని లోపాలపై దర్యాప్తు చేసేందుకు ఏ బృందాన్నీ పం పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ బడే భాయ్.. తెలంగాణలో కాంగ్రెస్ చోటే భా య్‌ని ఎందుకు కాపాడుతోందని, ఈ అపవిత్ర బంధానికి కారణమేంటని ప్రశ్నించారు. ఆరుగురు సజీవ సమాధి అయినా.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున ఆ ఆరు కుటుం బాలకు న్యాయం చేస్తామన్నారు. టన్నెల్ ప్రమాదానికి కారణమై, కార్మికుల ప్రాణాలను బలిగొన్న వారికి శిక్షపడేలా చేస్తామని ట్వీట్‌లో కేటీఆర్ వాగ్దానం చేశారు. 

బీఆర్‌ఎస్ పోస్టు... కేటీఆర్ రీపోస్టు

అబద్ధాల కాంగ్రెస్ ఏడో గ్యారెంటీ అం టూ బీఆర్‌ఎస్ చేసిన పోస్టును కేటీఆర్ రీపోస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. రాష్ర్టంలో యూరియా అడుగుతున్న రైతులను, భూముల కోసం పోరాడుతున్న ఆదివాసీ బిడ్డలను, నిరుద్యోగులను ప్రభు త్వం అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆరోపించింది.

రైతులు, నిరుద్యోగులు, బీఆర్‌ఎస్ నేతలపై కేసుల అంశాలపై వచ్చిన వార్తల క్లిప్పింగ్స్‌ను బీఆర్‌ఎస్ ఈ పోస్టులో షేర్ చేసింది. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి జహీరాబాద్ వరకూ అధికార కాంగ్రెస్ అరాచక పాలన చేస్తోందని మండిపడింది.

అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు వాటిని అమలు చేయాలని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతోందని వాపోయింది. ‘కేసులు, అరెస్టులు, జైళ్లు తమ గొం తును నొక్కలేవని, నియంతలను నిలదీసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తామని, పోరాటం తెలంగాణ జన్మహక్కు అని తెలుపుతూ.. తెలంగాణ ప్రజలు ఇకనైనా మేల్కోవాలి’ అని పిలుపునిచ్చింది. ఈ పోస్టును కేటీఆర్ రీపోస్టు చేశారు.