15-09-2025 02:01:42 AM
డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ‘ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సమస్యలను ప్రభు త్వం అర్థం చేసుకున్నది. చర్చలు జరిపే రోజు ఆదివారం కాబట్టి ఈరోజు ఏ నిర్ణయం తీసుకోలేం. సోమవారం విధానపరమైన నిర్ణ యం తీసుకుంటాం. అప్పటివరకు సమ్మెను విరమించమని యజమాన్యాలను కోరాం. యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలపై ఫెడరేషన్ ఆఫ్ అసోషియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టి ట్యూషన్స్ (ఫతి) సభ్యులతో ఆదివారం అర్ధరాత్రి వరకు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నతవిద్యా మండలి ఉన్నతాధికా రులు, సెక్రటరీ, కార్యదర్శులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సోమవారం ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
నేడు మళ్లీ చర్చలు..
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎలాంటి స్ప ష్టత రాకపోవడంతో సోమవారం బంద్ నిర్ణ యం యథావిధిగా కొనసాగుతుందని డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ సూర్యనారాయణరెడ్డి ‘విజయక్రాంతి’కి తెలిపారు. మళ్లీ చర్చలకు య థావిధిగా హాజరవుతామని తేల్చిచెప్పారు.