calender_icon.png 15 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగింపెప్పుడు!

15-09-2025 01:26:50 AM

  1. కాంగ్రెస్ నేతల పంచాయితీలపై ఎటూ తేల్చని క్రమశిక్షణ కమిటీ 
  2. కొందరికి నోటీసులిచ్చి.. వివరణతోనే సరిపెట్టడం 
  3. మరికొందరు బహటంగా విమర్శలు చేసినా పట్టించుకోని వైనం 
  4. సొంత పార్టీలో నాయకుల్లోనే వ్యక్తమవుతున్న అసంతృప్తి 
  5. రాజగోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు రాలేదు.. చర్చ చేయలేదు
  6. వరంగల్ నేతల లొల్లిపై తుది నిర్ణయం సీఎం, పీసీసీదే 
  7. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల విషయంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎటు తేల్చలేకపోతుంది. నాయకులిచ్చే నోటీసుల విషయం లోనూ కమిటీ వివక్షత చూపుతోందనే ఆరోపణలు సొంత పార్టీలోనే వస్తున్నాయి. నా యకుల్లో నెలకొన్న విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టకుండా సాగదీయడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

త్వరలో స్థానిక సం స్థల ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో నాయకుల మ ధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించకుం డా కాలయాపన చేయడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జి ల్లాలోని మంత్రి కొండా సురేఖ, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయితీ కొనసాగుతుండగానే.. మరోవైపు గజ్వే ల్, సిద్దిపేట నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడం, పీసీసీకి ఫిర్యాదులు రావడం.. నోటీసులిచ్చి వివరణ తీసుకొనే వరకు వచ్చింది.

దీంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇటీవల తరుచుగా చేస్తున్న విమర్శ లు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజగో పాల్‌రెడ్డి బహటంగానే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిం దే. అయితే రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే విషయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆచితూచి వ్యవహారిస్తోంది. 

ఫిర్యాదు రాలేదు..

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై తమ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అందుకే క్రమశిక్షణా కమిటీలో చర్చ జరగేలేదని కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మల్లు రవి అధ్యక్షతన పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట  నియోజకవర్గ నాయకులు పూజల హరికృష్ణపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు.

వరంగల్ జిల్లా నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, పంచాయితీపైనా కమిటీలో చర్చించారు. పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ వరంగల్ నాయకుల మధ్య నెలకొన్న పంచాయితీపై తుది నిర్ణయం పార్టీనే తీసుకుంటుందని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై, గజ్వేల్ నియోజకవర్గానికి చెం దిన కాంగ్రెస్ పార్టీలోని కొందరు దళితులు ఫిర్యాదు చేశారని, ఇదే అంశంపై వివరణ కోసం నోటీసు ఇచ్చామని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణపైన ఫిర్యాదు వస్తే వివరణ అడిగామని మల్లు తెలిపారు. స్థానిక ఎన్నికలు వస్తున్నందున అందరూ సమన్వయం పా టించాలన్నారు.

ఏదైనా ఇబ్బందులు ఉంటే తమకు లేదంటే పీసీసీకి ఫిర్యాదు చేయాలని మల్లు రవి సూచించారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని.. గతంలో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఆయన దుయ్యబట్టారు.  గత పదేళ్లలో ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని మల్లు రవి హితవు పలికారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు. 

పార్టీలో క్రమశిక్షణతో ఉండే నాకు నోటీసులా: నర్సారెడ్డి

సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల గజ్వేల్‌లో జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్‌కుమార్‌కు, నర్సారెడ్డికి మధ్య జరిగిన గోడవపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఆదివారం గాంధీభవన్‌కు వచ్చిన నర్సారెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు అందుకున్నారు.

ఆ తర్వాత నర్సారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలతో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరించినట్టు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే తనకు నోటీసులు ఇచ్చారని, పార్టీ కోసం పని చేసే తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాను దళితుల సహకారంతోనే రాజకీయంగా ఎదిగానని, దళితులకే ఎక్కువ పదవులు ఇచ్చానని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏ రోజూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వస్తే టపాసులు కాల్చి స్వాగతం పలికారని నర్సారెడ్డి వివరించారు.