calender_icon.png 8 May, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో కష్టపడి పనిచేసే వారికే కాంగ్రెస్ పార్టీ పదవులు

07-05-2025 06:34:01 PM

గ్రామ స్థాయి నుండి బ్లాక్ స్థాయి వరకు కమిటీలు..

పెద్దపల్లిలో జిల్లా పార్టీ సమావేశాంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో కష్టపడి పనిచేసే వారికే కాంగ్రెస్ పార్టీ పదవులు వరిస్తాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాగూర్(Congress Party District President Raj Tagore) అన్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్(MLA Makkan Singh Raj Thakur) అధ్యక్షతన జిల్లాల్లోని మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ పరిశీలకులుగా హాజరయ్యారు. జాతీయ, రాష్ట్ర పార్టీ నియమావళి మేరకు గ్రామ, మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకంపై పరిశీలకులు వివరించారు.

మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తాం 

జిల్లాల్లో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామని డీసీసీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు(Peddapalli MLA Vijaya Ramana Rao) మాట్లాడుతూ.. మొదట గ్రామ స్థాయి కమిటీలను ఎన్నిక చేసి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని, తద్వారా మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీకి సమయం కేటాయించి పని చేసేవారిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు సజావుగా కమిటీల నియామకం పూర్తి చేస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులను కమిటీల్లో ఎన్నిక చెస్తే రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలంకార ప్రాయంగా పదవులను అంటిపెట్టుకునే వారికి అవకాశాలు రావని, కష్టపడితేనే కార్యకర్తల అభిమానం చూరగొని పదవులు దక్కించుకుంటారని అన్నారు.

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్తాగత ఎన్నికలు రాష్ట్రానికి ఆదర్శంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, రామిడి తిరుపతి రెడ్డి, గండు సంజీవ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, దాన్నాయక్ దామోదర్ రావు, ఆరె సంతోష్,పట్టణ మండల పార్టీ అధ్యక్షులు,భూషణవేనా సురేష్ గౌడ్, కడర్ల శ్రీనివాస్, వేగోళం అబ్బయ్య గౌడ్, చీలిక సతీష్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, గజావేనా సదయ్య, బొజ్జ శ్రీనివాస్,  వివిధ అనుబంధ సంఘాల అద్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యీ మరియు కార్యదర్శులు పాల్గొన్నారు.