07-05-2025 05:42:42 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని పెంబి మండలం గిరిజన ఆదివాసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆదివాసి సంఘం జిల్లా కార్యదర్శి శంభు మాట్లాడుతూ... వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు రాక ఇబ్బందికి గురవుతున్నామని సీసీ రోడ్లు లేవని ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏవో సూర్య ప్రకాష్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు పాల్గొన్నారు.