calender_icon.png 18 October, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది

18-10-2025 03:46:22 PM

వికారాబాద్ జిల్లా ఉపాద్యక్షుడు యు. రవీందర్

మర్పల్లి,(విజయక్రాంతి): బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ కు మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు శనివారం మర్పల్లి మండలంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో  వికారాబాద్ జిల్లా ఉపాద్యక్షుడు  యు రవీంధర్ పాల్గొన్నారు.  అనంతరం వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని వారు అన్నారు.

రాహుల్ గాంధీ  ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి  ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోటిగారి జగదీశ్వర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.