18-10-2025 03:50:12 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు నేడు తలపెట్టిన రాష్ట్ర బీసీ బంద్ కు మద్దతుగా వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు విధులు బహిష్కరించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు గుడిసె సదానందం మాట్లాడుతూ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేయడం న్యాయబద్దమేనని అన్నారు.