18-10-2025 03:42:04 PM
భీమిని,(విజయక్రాంతి): భీమినీ మండల కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన బందు పిలుపుమేరకు శని వారం భీమిని మండలం కేంద్రంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంధు పాటించాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భీమిని మండల కేంద్రంలో బంధు విజయవంతమయ్యేలా అన్ని పార్టీల నాయకులు, యువకులు ప్రచారం నిర్వహించారు. బీసీ సంఘాల బందుకు తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్, నాయకులు, యువకులు భీమినిలో వ్యాపారస్తులు బందు నిర్వహించాలని రోడ్డుపై నినాదాలు చేస్తూ తమ మద్దతును ప్రకటించారు.