13-10-2025 12:43:58 AM
జగదేవపూర్, అక్టోబర్ 12: సిద్దిపేట జిల్లాలో అత్యంత మహిమ కలిగిన జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా తోపాటు హైదరాబాద్ నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రతి ఏటా తమ కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటామని నార్సింగి కి చెందిన భక్తులు హనుమంత్ రెడ్డి తెలిపారు. అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ సమయానికి దర్శనం కావడం అమ్మవారి దీవెనలేనని తెలిపారు. కొండపోచమ్మ దీవెనలు కొండంత అండగా ఉంటాయని భక్తులు ఆమె నామస్మరణం చేయడం ఆలయంలో కనబడుంది.