calender_icon.png 5 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుంది

05-08-2025 09:09:37 PM

మాజీ జెడ్పిటిసి డాక్టర్. శ్రీరామ్ శ్యామ్

హుజురాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరంపై దిగజారుడు రాజకీయాలు చేస్తుందని జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్: శ్రీరామ్ శ్యామ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందని, నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని కాంగ్రెస్ ప్రభుత్వం పి.సి.గోష్ కమిషన్ వేసిన ప్రభుత్వం కమిషన్ చైర్మన్ ఇచ్చిన సమాచారాన్ని దాస్తు మల్కా జిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పై బురద జల్లడం సబబు కాదన్నారు.

కమిషన్ ఈటల రాజేందర్ కి  ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఈటలను బదునం  చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుడిగా ఈటెల  రాజేందర్ ఎదుగుదల ఊర్వలేక కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈటల  రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి గా ఆరు సెప్టెంబర్ 2018 సంవత్సరం వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ ఎలాంటి నాయకుడో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న వాటిని గమనిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.