05-08-2025 09:06:40 PM
మందమర్రి,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ లు అన్నారు. మంగళవారం పట్టణంలోని 10 వ వార్డుకు చెందిన శనిగారపు రాములు కు మంజూరైన 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందచేశారు.
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమ్ధంలో జిల్లా నాయ కులు పైడిమల్ల నర్సింగ్,పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, సీనియర్ నాయకులు బండి శంకర్ గౌడ్,10వ వార్డ్ బాధ్యులు ఎండి జలీల్ లు పాల్గొన్నారు.