05-08-2025 11:35:35 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన పలువురిని కలిచి వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బోయినపల్లికి చెందిన ధర్మ తేజ్ అనే యువకున్నీ ప్రేమ వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా భర్త అనుమానిస్తూ చిత్ర హింసలకు గురి చేస్తుండడంతో గత వారం రోజుల క్రితం తాడికల్ లోని తనతల్లి గారి ఇంటికి వచ్చి ఉంటుంది.
సోమవారం రాత్రి భర్త ఫోన్ లో మాట్లాడి ఇబ్బంది పెట్టడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాత్రలు వేసుకొని, ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని మరణ వాగమూలాని బయటకు తెలియజేసింది. మృతురాలికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. మృతురాలి అన్న కొట్టే శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.