05-08-2025 11:42:22 PM
పోలీసులకు ఫిర్యాదు
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అమెర్ధ గ్రామానికి చెందిన వివాహిత, తన ఇద్దరు చిన్నపిల్లలతో అదృశ్యమైనట్లు ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు. మధు ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. ఆగస్టు 3వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో, ఉండాలా పరిధిలోని అమెర్ధ గ్రామానికి చెందిన శ్యామల లావణ్య (25) మణుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నాను అని తన భర్త శ్యామల రవికి తెలిపి ఇంటి నుండి బయటకు వెళ్లింది.
అయితే అదే రోజు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో, భార్య,ఇద్దరు పిల్లల ఆచూకీ కనిపించకపోవడంతో, భర్త వారి ఆచూకీ కోసం బంధువులు, ఇరుగు పురుగు వారి వద్ద వెతికినా కనిపించలేదు . దీంతో భర్త శ్యామల రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, దర్యాప్తు ప్రారంభించామని అశ్వాపురం ఎస్ఐ మధు ప్రసాద్ తెలిపారు.