05-08-2025 11:31:07 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష సందర్భంగా ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయడంతోపాటు, ఎవరైనా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేనట్లయితే స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని ఆదేశించారు.