05-08-2025 11:07:32 PM
మంథని,(విజయక్రాంతి): మండలంలోని నాగారంలో గ్రామ సమీపంలో 20 ట్రాక్టర్ల ఇసుక డంపు ను స్వాధీనం చేసుకున్నట్లు మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. గోదావరి నది నుంచి నేషనల్ హైవే రోడ్డు సమీపంలో ఇసుక డప్పు ఉన్నట్లు సమాచారం రావడంతో మంగళవారం ఎస్సై రమేష్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ హైవే సమీపంలో 20 ట్రాక్టర్లు ఇసుక డంపు ఉండడంతో డంపును స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండలంలో అక్రమంగా ఇసుక తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.