05-08-2025 11:26:51 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల చేత పార్టీలకు ఇక్కట్లు తప్పవు
జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్
చేర్యాల,(విజయక్రాంతి): ఈ నెల 12న విద్యా సంస్థల బంధుకు పిలుపునిచ్చిన సందర్భంగా నేడు ప్రతి పాఠశాలకు ప్రతి విద్యార్థికి రెవెన్యూ డివిజన్ అంశం ప్రాధాన్యత తెలువాలని కోరుతూ మంగళవారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ చేర్యాల ప్రాంత పరిధిలోనీ చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట, మండలాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలోని విద్యార్థులకు చేర్యాల ప్రాంత వైభవాన్ని, చేర్యాల రెవిన్యూ డివిజన్ అంశం యొక్క ప్రాధాన్యతను వివరించాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులే ఈ ప్రాంతం యొక్క భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిపాలన పై స్పష్టమైన అవగాహన ఆలోచన కలిగి ఉండాటానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. చేర్యాల ప్రాంతంలోనీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు రానున్న స్థానిక సంస్థల టికెట్ల కోసం మీ పార్టీ ఇంచార్జిల వద్దకు పరిగెత్తకుండా ఈ ప్రాంత ప్రజల ఇక్కట్ల గురించి ఆలోచన చేయాలని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను, అవసరాలను పక్కకు పెడితే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల చేత మీకు ఇక్కట్లు తప్పవని, ఓట్ల కోసం గ్రామాలలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం కాదు, ప్రజలను రెవెన్యూ డివిజన్ అంశంపై సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.