calender_icon.png 6 August, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా ముగిసిన పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్

05-08-2025 11:33:30 PM

గచ్చిబౌలి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 200కు పైగా అథ్లెట్లు జూనియర్, సబ్ జూనియర్  విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాధికార సంస్థ (SATS) చైర్మన్ శివసేన రెడ్డి, పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విశ్లావత్ శేఖర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ పారా అథ్లెట్ల పట్టుదల, ప్రదర్శనలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, SATS పారా క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని అన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో 100, 200, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్ తో పాటు షాట్ పుట్, జావెలిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా, విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వాలంటీర్లు, అధికారులు, ఇతర శాఖల సహకారానికి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా పారా అథ్లెట్ల ప్రతిభకు నూతన వేదికను అందిస్తూ, తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ మరో మైలురాయిని సాధించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.