3 April, 2026 | 8:54 PM

మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ రాజకీయం

17-06-2025 12:50 AM

బీజేపీ నేత ఎన్వీ సుభాశ్

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రజాకార్ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు ఇస్తూనే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ విమర్శించారు. నిజాం పాలనలో రజాకార్ల అఘాయిత్యాలను రజాకర్ చిత్రం చూపించిందన్నారు.

మైనారిటీల విషయంలో బుజ్జగింపు పాలసీలను కొనసాగించడాన్ని ఆయన ద్వంద్వ వైఖరిగా సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. కాంగ్రెస్ వ్యవహారం ఒక చేత్తో చరిత్రను గుర్తించి, మరో చేత్తో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వంటిదని విమర్శించారు. గద్దర్ పేరు మీద అవార్డులను ఏర్పాటు చేయడమే వివాదాస్పదమన్నారు.

గద్దర్ వామపక్ష వ్యతిరేక సిద్ధాంతాలు, నిషేధిత జననాట్య మండలితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఎఫ్డీసీ అవార్డుల ఎంపిక ప్రమాణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.