18-12-2025 08:27:56 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ర్యాలీ కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బిజెపి ప్రభుత్వం రాజకీయ కక్షతో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి ద్వారా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ కేసుల్లో ఢిల్లీ కోర్టు ఈడి చర్యలను తప్పు పట్టిన అంశాలను ప్రజలకు వివరించేందుకు ఈ నిరసన ర్యాలీ చేపట్టామని అన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ధమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతులను అణిచివేసేందుకు బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఈ నిరసన ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శులు ఈ.వి శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ అజీజ్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ రజాలి, మామిండ్ల రాజు, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, అంకుష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ, బీసీ సెల్ చైర్మన్ విక్రమ్, పులి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు ఏనుకొంటి నాగరాజు, తాడిశెట్టి విద్యాసాగర్, కాంగ్రెస్ శ్రేణులు బుస్సా నవీన్ కుమార్, మట్టెడ అనిల్, పలు డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.