29-01-2026 03:21:26 PM
హైదరాబాద్: రైతుల నోట్లో మట్టి కొట్టి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు భరోసా లేదని హరీశ్ రావు ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయానికి దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన(Congress rule ) బ్రేకులు లేని బస్సులా మారిందని ఎద్దేవా చేశారు. రైతబంధు, బోనస్, పంట నష్టం డబ్బులు ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.