29-01-2026 03:32:46 PM
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కి సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ద్వజమెత్తారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శమని తెలిపారు. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది విచారణ కాదు.. ప్రతీకారం, ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సూచించారు. ప్రజల గొంతుకగా అన్యాయపు పాలనపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.