07-10-2025 10:04:57 PM
రేగొండ (విజయక్రాంతి): మృతుల కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే రేగొండ, మండలంలోని గూడపల్లి గ్రామంలో కుమ్మరి రసజ్ఞ, చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామంలో జాలిగపు మల్లయ్య, జాలిగపు పోషమ్మలు వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబాలను విమర్శించి మృతుల ఫోటోలకు పూలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.