calender_icon.png 15 October, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలి

15-10-2025 12:40:15 AM

  1. గడప గడపకూ ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లాలి
  2. బూత్‌స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్, మంత్రులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకూ వెళ్లి వివరించాలని రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగల్‌రావునగర్, యూసుఫ్‌గూడకు సంబంధించిన బూత్‌స్థాయి మీటింగ్‌ను మంగళవారం యూసుఫ్‌గూడ మహమూద్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశా రు.

ఈ మీటింగ్‌కు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరావు, గడ్డం వివేక్ వెం కటస్వామి, సీతక్క, ఎంపీ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్- శివసేన, సాంస్కృతిక సారథి చైర్మన్- వెన్నెల, ఖైరతాబాద్ కార్పొరేటర్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయరెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సంద ర్భం గా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మరింత ఘనంగా నిలపడం మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రతి ఓటరుకు చేరవేయాలని చెప్పారు.

బూత్ స్థాయి నుంచి మన బలం కనిపించాలి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చెందుతున్నారని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రతి బూత్ స్థాయి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. కలిసికట్టుగా కష్టపడితే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అని ఉత్సాహపరిచారు.