calender_icon.png 15 October, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ కైలాస్‌కే పట్టం కట్టాలి

15-10-2025 12:40:51 AM

పార్టీ పదవి ఇవ్వకుంటే ఉన్నత పదవి ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ నాయకులు

కామారెడ్డి, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా తిరిగి కైలాస్ శ్రీనివాసరావును నియమించాలని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కోరారు. ఎన్నో సంవత్సరాలగా వాటికోసం పనిచేస్తున్న కైలాస్ శ్రీనివాసరావు తిరిగి జిల్లా అధ్యక్ష పదవినీ కట్టబెట్టాలని కోరారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి డిసిసి అధ్యక్షునిగా తిరిగి కైలాస్ శ్రీనివాసరావును ఎన్నిక చేయా లని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్య క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షా ళన చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం కామారెడ్డి  నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం  కామారెడ్డి పట్టణ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మంగళవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోరుకునే వారి ద్వారా దరఖాస్తులకు ఆహ్వానించారు. ఏఐసిసి అబ్జర్వర్  రాజ్ పాల్ కరోల, ప్రభుత్వ సలహా దారు మహమ్మద్ అలీ షబ్బీర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు  నియోజక వర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని స్వీకరిం చారు.

మండల అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రా మ అధ్యక్షులు ఏకగ్రీవంగా కైలాస్ శ్రీనివాస్ రావు పేరును తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన కైలా శ్రీనివాసరావును తిరిగి నియమించాలని నియోజకవర్గం మొత్తం కోరింది.కైలాస్ శ్రీనివాసరావుకి మార్చాలని నిర్ణయిస్తే ప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం ఆయ నకు కల్పించిన తర్వాతే ఆయనను మారు స్తాం అని తెలిపారు.

సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం ఇది పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా యువత, మహి ళలు, అనగారిన వర్గాల గొంతుక వినిపిం చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంద అన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడు తుంది అని చెప్పారు. ఏఐసిసి అబ్జర్వర్  రాజ్ పాల్ కరోల మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుం డా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కాంగ్రెస్ పార్టీ కలుపుకుని పోతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గము తాలూకా, మునిసి పాలిటీ మరియు మునిసిపల్  వార్డులను సందర్శించి, అట్టడు గు స్థాయి కార్యకర్తలతో సంప్రదించి, కొత్త స్థానిక నాయకులను నియమిస్తారు.

యువకులు, విద్యావంతులు మరియు సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుం దన్నా రు. అది ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం మాపర్యటన తర్వాత,  నియామకాలను ఖరారు చేయడానికి రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు సమర్పించబడతా అని తెలిపారు. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల అభిప్రా యాలు తీసుకుని  ఎవరైనా అధ్యక్ష పదవి కావాలనుకునేవారు తమ దరఖాస్తులను సమర్పించాల అని కోరుతామన్నారు. అంద రూ పాతవారినే కోరుకుంటే తిరిగి ఆయనని ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, చంద్రకాంత్ రెడ్డి, జిల్లాలోని పలు మండలా ధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.