calender_icon.png 30 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

30-09-2025 05:59:31 PM

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి, శ్రావణపల్లి, బహదూర్ ఖాన్ పేట గ్రామాల్లో వెలిచాల రాజేందర్ రావు విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు కరీంనగర్ నియోజకవర్గంలో పేదలకు ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు అండగా ఉంటుందని ఇందుకు నిదర్శనమే నాలుగువేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపిటిసిలుగా, ఎంపీపీలుగా జెడ్పిటిసిలుగా గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా అహర్నిశలు పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.