30-09-2025 05:56:18 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీని శాలువా, పుష్పగుచ్ఛం, మెమెంటో, స్వీట్లు అందజేసి సన్మానించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను వివరించి, ప్రతి సంవత్సరం టీఎన్జీవోల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఉద్యోగులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఏ.వి. రాజేశ్వరరావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోటా రామస్వామి, శంకర్, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.