20-05-2024 01:03:29 AM
దుబాయిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, మే19(విజయక్రాంతి): గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మూడు రోజులుగా దుబాయిలో పర్యటిస్తున్న ఆయన అక్కడి తెలుగు కార్మికులు, కార్మిక సంఘాలతో సమావేశమై సమస్యలు ఆలంకించారు. భీమారం మండల మోత్కురావుపేటకు చెందిన గణేశ్ భూమల్ల(25) విధుల్లో ఉండగానే ప్రమాదవశాత్తు మరణించినట్లు తెలుసుకున్నారు.
వెంటనే గణేశ్ పని చేసే కంపెనీకి వెళ్లి యజమాని విజయ్‌ను కలిసి వాస్తవ పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం ఆ కంపె నీ హెచ్‌ఆర్‌తో మాట్లాడి గణేశ్ మృతదేహాన్ని ఇంటికి చేరేవేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక్కడ తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట గ్వాక్ యూఏఈ ఉపాధ్యక్షుడు మల్లేష్ కోరేపు, విజయ్ తదితరులు ఉన్నారు.