13-11-2025 07:12:17 PM
చెట్లను తొలగించాలని వాహనదారుల విజ్ఞప్తి..
నకిరేకల్ (విజయక్రాంతి): శాలిగౌరారం మండల కేంద్రం నుండి ఊట్కూరు వెళ్ళే రహదారిపై ఉన్న మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా దట్టమైన చెట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా సాయంత్రం వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని వారు తెలిపారు. ప్రమాదకర మలుపుల వద్ద ఉన్న చెట్లను వెంటనే తొలగించి రహదారిని సురక్షితంగా మార్చాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.